- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ సారి పోటీ చేయను.. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 1978 నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేశానని.. ఈ దఫా నేను పోటీ చేయడం లేదన్నారు. నా ఇద్దరు కుమారులు పోటీ చేస్తారా లేక ఒకరా అనేది వారే నిర్ణయించుకుంటారన్నారు. ఇద్దరికి టికెట్టిచ్చే అంశం అధిష్టానం చూసుకుంటుందన్నారు. తాను సీఎం కావాలనేది రాష్ట్ర నేతలు, అధిష్టానం కోరిక అయితే సీఎంగా నియమించిన తర్వాత పోటీ చేస్తానన్నారు. నల్గొండలో శుక్రవారం జరిగిన నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story