జగ్గారెడ్డిని గెలిపించడానికి అయ్యేఖర్చు నేనే భరిస్తా: K. A. Paul

by Naresh |   ( Updated:2023-08-20 16:13:13.0  )
జగ్గారెడ్డిని గెలిపించడానికి అయ్యేఖర్చు నేనే భరిస్తా: K. A. Paul
X

దిశ, సదాశివపేట: జగ్గారెడ్డిని ఏనాడు నేను శపించలేదని, కేవలం ప్రజాశాంతి పార్టీలోకి రమ్మంటున్నాననీ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సదాశివపేటలోని తన చారిటబుల్ ట్రస్టులోఆదివారం ‘మార్పు కావాలి.. మార్పు రావాలి.. ఆ మార్పు మనమే తేవాలి’ అనే నినాదంతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సదాశివపేటలో1,200 ఎకరాల్లో చారిటీ నిర్మించానని, దాన్ని చూసి దేశవిదేశాల ప్రతినిధులు ఆశ్చర్యపోయారని తెలిపారు. జగ్గారెడ్డిని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పానన్నారు. జగ్గారెడ్డిని గెలిపించడానికి అయ్యే ఖర్చు తానే భరించుకుంటానని హామీ ఇచ్చారు. జగ్గారెడ్డి ఓడిపోయిన సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న తన ఆస్తిలో వాటా కల్పిస్తానని చెప్పారు.

Advertisement

Next Story