లిక్కర్ స్కాం కేసు: పిళ్ళయ్ మనసు ఎందుకు మారిందో తెలుసు

by Sathputhe Rajesh |
లిక్కర్ స్కాం కేసు: పిళ్ళయ్ మనసు ఎందుకు మారిందో తెలుసు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణంలో తమ దర్యాప్తు ముమ్మరమై ముగింపునకు చేరుకుంటున్న సమయంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ తన మనసు ఎందుకు మార్చుకున్నారో తెలుసని స్పెషల్ కోర్టులో వాదించింది. ఈ కేసులో ఒక బలమైన వ్యక్తికి సమన్లు జారీచేసి విచారణకు రావాల్సిందిగా డేట్ ఫిక్స్ చేసిన సమయంలో పిళ్లై మనసు మారిందని కోర్టుకు వివరించింది. చాలా కీలకమైన టైమ్‌లో పిళ్ళై వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని ఈడీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

గతేడాది సెప్టెంబరు నుంచి ఆయన మొత్తం మూడు స్టేట్‌మెంట్లు ఇచ్చారని, ఈ నెలలోనే ఉపసంహరించుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించి దానికి ఎలాంటి పరిస్థితులు దారితీశాయో అర్థమవుతూనే ఉన్నదని కోర్టుకు వివరించారు. గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకునేలా ఇదే కోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారని ఈడీ తరపు న్యాయవాది గుర్తుచేశారు. నిజానికి పిళ్ళై తన పాత స్టేట్‌మెంట్‌ను విత్‌డ్రా చేసుకోవాలని తన పిటిషన్‌లో పేర్కొన్నా ఇప్పటివరకు ఆయన ఇచ్చిన మొత్తం మూడు స్టేట్‌మెంట్లలో ఒకే తరహా వివరణలు ఉన్నాయని న్యాయవాది వివరించారు.

పిళ్లయ్ దాఖలు చేసిన ఉపసంహరణ పిటిషన్‌పై స్పెషల్ కోర్టులో సోమవారం జరిగిన వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాది పై కామెంట్లు చేశారు. పిళ్లయ్ నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసినప్పుడు, ఆయనను విచారించే క్రమంలో ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు రాబట్టినప్పుడు మొత్తం వీడియోలో చిత్రీకరించామని కోర్టుకు న్యాయవాది వివరించారు.

పాత స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోడానికి పిళ్లయ్ లేవనెత్తిన వాదనలను ఈడీ తరపు న్యాయవాది ప్రస్తావిస్తూ, పిళ్లయ్‌పై ఈడీ అధికారులు ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని, వీడియో ఫుటేజీని చూసుకోవచ్చని కోర్టుకు వివరించారు. పిళ్లయ్ ఎంక్వయిరీ ఫుటేజీలో పూర్తి వివరాలు ఉన్నాయన్నారు. గతేడాది సెప్టెంబరు 18న తొలిసారి పూర్తిస్థాయిలో స్టేట్‌మెంట్ ఇచ్చారని, అందులో సమగ్రమైన వివరాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ తర్వాత సెకండ్, థర్డ్ స్టేట్‌మెంట్లలో సైతం ఇవే వివరాలను మరోసారి ఆయన ధ్రువీకరించారని పేర్కొన్నారు. ఆయనను టార్చర్ చేసినట్లు ఆరోపణల్లో నిజం ఉన్నట్లయితే రెండో, మూడో స్టేట్‌మెంట్లలోనూ అవే వివరాలను ఎలా ఇవ్వగలుగతారని ఈడీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ నెలలోనే ఆయన మనసు మార్చుకున్నారని, ఒక ముఖ్యమైన వ్యక్తికి సమన్లు జారీచేసి విచారించాలనుకుంటున్న సమయంలో ఇది జరగడం వెనక కారణాలు స్పష్టమేనని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

Advertisement

Next Story

Most Viewed