Hydra: ప్రజ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలి.. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్

by Ramesh Goud |
Hydra: ప్రజ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలి.. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్
X

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా(Hydra)లోని ప్రతీ అధికారి ప్రజ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) చెప్పారు. గ‌ణ‌తంత్ర దినోత్సవం(Republic Day) సంద‌ర్భంగా ఆదివారం హైడ్రా కార్యాల‌యంలో(Hydra Office) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025వ సంవ‌త్సరం హైడ్రాకు ఎంతో కీల‌క‌మైన‌ద‌ని.. చెరువుల ప‌రిర‌క్షణ‌, పున‌రుద్ధర‌ణ‌, ప్రభుత్వ భూముల‌తో పాటు.. ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూముల‌ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కంక‌ణ‌బ‌ద్ధులు కావాల‌ని కోరారు. అంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజాస్వామ్య హ‌క్కుల గౌర‌వ‌మిస్తూ.. ప్రజ‌ల ఆకాంక్షల మేర‌కు ప‌ని చేసి వారి మ‌న్నన‌లు అందుకోవాల‌ని హైడ్రా అధికారుల‌కు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అంతేగాక ప్రభుత్వ ఆలోచనలు, ప్రజ‌ల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప‌ని చేయాలని సూచించారు.

Advertisement
Next Story

Most Viewed