- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hydra: చిత్రపురి కాలనీలో హైడ్రా దూకుడు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధిలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెడ్రా) ఆపరేషన్ కొనసాగుతున్నది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా అధికారులు బుల్డోజర్లు పరిగెత్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట సరస్సు, ఎఫ్ టీఎల్, బపర్ జోన్ లోని అక్రమ భవనాలను కూల్చివేసిన హైడ్రా తాజాగా చిత్రపురి కాలనీపై పడింది. మంగళవారం మణికొండ చిత్రపురికాలనీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఇక్కడ 220 విల్లాలకు అనుమతులు పొంది 7 విల్లాలు అదనంగా సొసైటీ సభ్యులు నిర్మించారు. అక్రమంగా నిర్మించిన ఈ ఏడు విల్లాలను హైడ్రా పంజా విసిరింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు ఇవాళ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో సొసైటీ సభ్యులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే అక్రమ నిర్మాణాల విషయంలో బడా బాబులను సైతం వదిలే ప్రసక్తే లేదని హెడ్రా అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో చెరువులు, పార్కులను చెరపట్టి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హెడ్రా తాజాగా హై ప్రొఫైల్ ప్రజలు ఉండే చిత్రపురి కాలనీలో కూల్చివేత్తలు హాట్ టాపిక్ గా మారాయి.
హైడ్రా ఆలోచన భేష్.. కానీ..: కాటిపల్లి
హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో అది సాధ్యం కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూమి కొనుగోలు చేసినప్పుడు చాలా మందికి అది ఏ పరిధిలోనిది అనేది తెలియదన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందా? అనుమతులు ఉన్నాయా? లోన్ వస్తుందా అనేది మాత్రమే ప్రజలు చూస్తారు. గతంలో అన్ని అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలేసి సామాన్యులపై పడటం ప్రజాపాలన కాదన్నారు. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి, కమిషనర్ గా ఉన్న ఏవి రంగనాథ్ ఈ విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అని ప్రశ్నించారు. హైడ్రా వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో చెరువులు ఎన్ని ఉన్నాయి అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా పై మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని, సచివాలయం ముందు వంట వార్పు చేపడతామన్నారు. హైడ్రా పేరుతో చేస్తున్న కూల్చివేతలను ఆపకపోతే ప్రజల తరుపున పోరాటాలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.