Minister Ponnam : యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలి

by Kalyani |
Minister Ponnam : యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: యువత డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వంటి దురలవాట్ల భారిన పడకుండా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సే నో డ్రగ్స్ పేరిట నిర్వహిస్తున్న అవగాహన సదస్సు పోస్టర్ ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసు పాదం థామస్, షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ సిబ్బంది ఆర్ ఏ. వినోద్ కుమార్ లను మంత్రి అభినందించారు . ఈ సందర్భంగా యేసు పాదం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీహెచ్. అశోక్, ఆర్ ఏ. హితేష్, సీహెచ్. సురేష్, తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed