- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం..
దిశ, జూబ్లిహిల్స్ : జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం అయిన ఘటన జరిగింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లిహిల్స్ యూసుఫ్‌గూడ లోని కార్మిక నగర్ లో పొల్లయ పీతాంబరం తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. పీతాంబరం కి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. పీతాంబరం కుమార్తె పోల్లయ జయంతి వయస్సు ( 21 ) ఎస్‌ఆర్ నగర్‌లో ఎయిర్ హోస్టర్ గా శిక్షణను పూర్తి చేసింది.
2023 మార్చి 30 మధ్యాహ్నం సుమారు 11 గంటల సమయంలో పితంబరం కూతురు పొల్లయ్య జయంతి తన సర్టిఫికెట్లు తీసుకురావడానికి ఇంటి నుండి ఎస్‌ఆర్ నగర్ లో వున్న ఫ్రాంకీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టర్స్ కి బయలుదేరింది. సాయంత్రం అయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవటంతో ఫోన్ చేశారు. ఫోన్ స్విచాఫ్ రావడంతో పీతాంబరం కొడుకు లవీన్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి జయంతి కోసం అడగక ఆమె రాలేదని తెలపటంతో వెంటనే కొడుకుతో కలిసి పీతాంబరం సాధ్యమైన అన్ని ప్రదేశాల్లో వెతకగా ఫలితం లేకపోయింది. దీంతో వారు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .
తప్పిపోయిన మహిళ వివరాలు పొల్లయ్య జయంతి, తండ్రి పొల్లోయ పీతంబరం, వయస్సు (21), ఎత్తు 5.4 అడుగులు. రంగు తెలుపు. మాట్లాడే భాష : తెలుగు. హిందీ. ఇంగ్లీష్ , ఒరియా పైన తెలిపిన గుర్తుతో మహిళ ఆచూకీ తెలిస్తే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కి తెలియ పరచాలని ఎస్సై నాగరాజు తెలిపారు.