- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క పేదోడి ఇల్లు కూడా కూల్చనివ్వం
దిశ, కార్వాన్ : మూసీ నది బాధితులకు అండగా ఉంటామని, బుల్డోజర్ కు అడ్డం నిలుస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ మూసీ నది సుందరీకరణ కోసం ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని అన్నారు. ఆదివారం లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బుల్డోజర్ కి అడ్డంగా నిలబడి, తమ ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. కానీ పేదోడి ఒక్క ఇల్లు కూడా పోనియ్యమని అన్నారు.
యూపీలో యోగి ఆదిత్యనాథ్ ది బుల్డోజర్ ప్రభుత్వమని రాహుల్ గాంధీ ప్రగల్బాలు పలుకుతున్నారని, మరి ఇక్కడ కాదా అని ఆరోపించారు. వారు చేతి గుర్తు కాకుండా బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు. 50 సంవత్సరాలు పేదవాళ్లు కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూల్చడం కాదని, పర్మీషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు మందులు లేక బయట కొనుగోలు చేసుకుంటున్నారని, ఈ విషయంపై ప్రశ్నిస్తే డబ్బులు లేవని పేర్కొన్నారని గుర్తు చేశారు. మరి మూసీ సుందరీకరణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.