- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెడికల్ ఆఫీసర్ల నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ..

X
దిశ,హైదరాబాద్ బ్యూరో : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటి అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో 32 మంది మెడికల్ ఆఫీసర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని బస్తీ దవాఖానల్లో తాత్కాలికంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు ఎంబీబీఎస్ చదివి తెలంగాణ/ ఏపీ మెడికల్ కౌన్సిల్ లో నమోదైన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సికింద్రాబాద్ లోని తమ కార్యాలయంలో నిర్వహించే ఎంపికకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలు, దరఖాస్తు ఫారాలు జిల్లా అధికారిక వెబ్ సైట్ www.hyderabad.telangana.gov.in లో ఉంచినట్లు డాక్టర్ వెంకటి తెలిపారు.
Next Story