Harish Rao : వినాయక చవితి అంటే డివోషన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా…

by Kalyani |
Harish Rao : వినాయక చవితి అంటే డివోషన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా…
X

దిశ, ఖైరతాబాద్ : వినాయక చవితి అంటే డివోషనల్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతి పెద్ద ఖైరతాబాద్ గణేష్ మహరాజ్ ను సందర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రమంతా ఇక్కడే ఉన్నట్లు ఉంది అన్నారు. 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత నిర్వాహకులకు దక్కుతుందని, వారి కృషికి, ఇన్నేండ్లుగా ఘనంగా నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారత సంస్కృతి.. అవసరమైనప్పుడు అందరం ఒక్కటవుతాం అన్ని పండుగలు సామూహికంగా సంతోషంగా కలిసి నిర్వహించుకుంటామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed