- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ చైతన్య కళాశాలల్లో ఆగని అరాచకాలు.
దిశ, శేరిలింగంపల్లి : శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాలేజీలో లెక్చరర్ల వేధింపులు, యాజమాన్యం ఒత్తిడిలు తట్టుకోలేక విద్యార్థులు అర్దాంతరంగా తనువులు చాలిస్తున్నారు. విద్యార్థుల పై వేధింపులకు శ్రీ చైతన్య కాలేజీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలలో లెక్చరర్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న మదీనగూడ కాలేజీలో విద్యార్థినుల పట్ల కెమిస్ట్రీ లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించగా తాజాగా మదీనాగూడ భారతి భవన్ శ్రీ చైతన్య కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ శివ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు స్నాప్ చాట్ లో అసభ్యకరంగా మెసేజ్ లు చేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మదీనాగూడ భారతి భవన్ డే స్కాలర్ క్యాంపస్ లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న శివ గత కొంతకాలంగా విద్యార్థినులకు స్నాప్ చాట్ లో మెసేజ్ లు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను మీడియాకు అందించారు. ఇవాళ వైట్ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు, నీకు లవర్ ఉన్నాడు. ఏంట్రా నా మీద కోపమా.. నువు కోపంగా ఉన్నావని నేను కాలేజీకి రాలేదు.
నువు హర్ట్ అయితే నేను ఉండలేను. అందమైన మొహాలు ఇక్కడే ఉన్నాయి. నువు ఎక్కడున్నావు ఇంకా రాలేదు. నీకోసం ఎదురుచూస్తున్నాను అంటూ అనేక మెసేజులు విద్యార్థినిలకు పంపాడు. విద్యార్థినులు ఆయన మెసేజ్ లకు రిప్లై ఇవ్వకపోతే నా మెసేజ్ ఇంకా చూడలేదు ఏంటి. అంత బిజీనా అంటూ ఇలా విద్యార్థినిలకు పంపిన అనేక మెసేజ్ లు స్నాప్ చాట్ లో ఉన్నాయి. ఈ విషయం విద్యార్థి సంఘాల దృష్టికి రావడంతో మంగళవారం ఉదయం నవతెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్, ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి సెక్రటరీ ధర్మతేజ ఇతర విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వైస్ ప్రిన్సిపల్ శివ తమను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇంట్లో చెబితే మీకు మార్కులు వేయమని, ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తామని బెదిరించారని, అందుకే తాము ఎవరికీ చెప్పుకోలేక, సార్ వేధింపులు భరించలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇదే విషయం పై కాలేజీ ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్తే మీరు బట్టలు తీసి డ్యాన్స్ చేస్తుంటే వీడియోలు తీయలేదుగా.. దానికే ఎందుకు అంత ఫీల్ అవుతున్నారని తమను ఇబ్బంది పెట్టేలా మాట్లాడారని పలువురు విద్యార్థినులు విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకువచ్చారు.
వైస్ ప్రిన్సిపల్ శివపై చర్యలు తీసుకోవాలి..
శ్రీ చైతన్య కాలేజీ మదీనాగూడ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపల్ ను విధుల్లో నుండి గత 5 రోజుల క్రితమే తొలగించామని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా, అతను సోమవారం కూడా కాలేజీలో ఉన్నట్లు విద్యార్థినులు చెబుతున్నారు. సోమవారం మ్యాన్ వల్ అటెండెన్స్ ఎంట్రీలో లెఫ్ట్ అని రాసినట్లు ఉందని, అంటే అతన్ని కాలేజీ నుండి ఇంకా తొలగించలేదని, వెంటనే తొలగించి కేసులు పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
విద్యార్థి సంఘాల ఆందోళన.. డ్రైవర్లను పిలిపించిన యాజమాన్యం..
విద్యార్థినిల పట్ల లెక్చరర్ల వేధింపులకు నిరసనగా పలు విద్యార్థి సంఘాలు కాలేజీలో ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం విద్యార్థుల బస్సు డ్రైవర్లను కాలేజీలోకి పిలిపించింది. దీంతో విద్యార్థి సంఘాల మీద దాడికోసమే పిలిచారని, ఇక్కడ తాము ధర్నా చేస్తుంటే ఎలా వారిని పిలుస్తారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.