పసి పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.. Union Minister kishan reddy

by Javid Pasha |   ( Updated:2023-01-21 13:44:35.0  )
పసి పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.. Union Minister kishan reddy
X

దిశ, సికింద్రాబాద్: పసి పిల్లల ఆరోగ్య సంరక్షణ పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం తగిన శ్రద్ధ వహించాలనే ఉద్దేశ్యం తో ప్రధాని నరేంద్ర మోడీ హెల్తీ బేబీ షో కార్యక్రమానికి పిలుపునిచ్చారని అయన తెలిపారు. ఈ మేరకు శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని శాంతి నగర్ నఫీజ్ గార్డెన్ లో హెల్తీ బేబీ షో ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై 3 నెలల నుంచి13 నెలల చిన్నారులకు కిట్స్, సర్టిఫికెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పసి పిల్లల ఆరోగ్య సంరక్షణ పట్ల తల్లిదండ్రులతో పాటు, సమాజంలో ప్రతి ఒక్కరూ తగిన శ్రద్ద చూపించాలని అయన సూచించారు. ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా చదివించాలని తెలిపారు.

అందుకే కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సరైన సమయంలో టీకాలు ఇప్పించాలని సూచించారు. తల్లి పాలే బిడ్డకు మంచి ఆహారం అని ప్రజల్లో చైతన్యం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. ఈ బేబీ షో కార్యక్రమాలు డివిజన్ స్థాయిలోను నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కావ్య కిషన్ రెడ్డి, మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీక రెడ్డి, శ్యాంసుందర్, జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు అనిత, సత్యవతి, సారంగపాణి, వీరన్న, నాగేశ్వర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed