రోడ్డు జాగానే తాగుబోతుల అడ్డా..

by Aamani |
రోడ్డు జాగానే తాగుబోతుల అడ్డా..
X

దిశ, జూబ్లిహిల్స్: అదొక రెసిడెన్షియల్ ఏరియా. చుట్టూ ఇల్లు , లేడీస్ హాస్టల్ లు , వైన్ షాప్ కు కూత వేటు దూరంలో మహిళా శిశు,సంక్షేమ వసతి గృహం ( స్టేట్ హోం ) , మెట్రో స్టేషన్ కలదు. విద్యార్థులు, వర్కింగ్ ఉమెన్స్ అదే దారిలో ఉద్యోగాలకు , మెట్రో స్టేషన్ కి వెళ్ళాలి అంటే వైన్ షాప్ ముందు వున్న దారిలో గుండానే పోవాలి. ఆ వైన్ షాప్ ముందు ఉన్న రోడ్డు జాగానే తాగుబోతులకు అడ్డాగా మారింది. ఆ వైన్ షాప్ ముందు తాగుబోతులు బరితెగించి రోడ్డు మీదనే తాగి , ఇబ్బంది కలిగిస్తున్నారని స్థానిక మహిళలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే... మధుర నగర్ , స్టేట్ హోమ్ పక్కన ఎస్ ఎల్ వైన్స్ అనే వైన్ షాప్ వుంది. ఈ వైన్ షాప్ చుట్టూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లు , ఇల్లు లు ఉన్నాయి. ఈ వైన్ షాప్ ఎదుట నుండే మధుర నగర్ కాలనీ వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సాయంత్రం 5 గంటలు అయితే చాలు , తాగుబోతులు ఈ రొడ్డును ఆక్రమిస్తారు. రోడ్డు మీద ఆటో లు , బైక్ లు పెట్టి వాహనాల మీదనే మందు కలపడం , తాగడం చేస్తారు.

ఇక వాహనదారులు , పాదచారులు , మహిళలు ఈ వైన్ షాప్ గుండా వెళ్ళాలి అంటే నే భయం తో వణుకుతున్నారు. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మందు బాటిల్ తో కొడతారో ..? ఏమైనా చేస్తారో అని... రెండు రోజుల క్రితం తాగుబోతులు సిగరెట్ కాలుస్తూ ఊసిన ఉమ్ము నడుచుకుంటూ వెళుతున్న స్థానిక వర్కింగ్ ఉమెన్ పై పడింది. చుట్టూ తాగుబోతులు , చీకటి గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారో అని భయం తో సైలెంట్ గా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైనా మేజర్ ప్రమాదం జరిగితేనే అధికారులు పట్టించుకుంటారా ...? అప్పటి వరకు చూసి చూడకుండా వదిలేస్తారా ...? అని మహిళలు మండి పడుతున్నారు. ఈ విషయం పై ఇటు ట్రాఫిక్ అధికారులు పట్టించుకోక ...? ఎక్సైజ్ పోలీస్ అధికారులు పట్టించుకోకపోతే , సాయంత్రం 5 గంటలు దాటితే ఈ రోడ్డు గుండా స్థానిక మహిళలు , పాదచారులు పోవాలి అంటే అది ప్రమాదకర ప్రయాణమే అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్సైజ్ సీఐ సైదిరెడ్డి కి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక నైనా నూతన ఎక్సైజ్ అధికారులు , ట్రాఫిక్ అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టి , ప్రజా సమస్య నీ పరిష్కరిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు..

Advertisement

Next Story

Most Viewed