HYD:‌ మెట్రో రైల్ విస్తరణపై వేగం పెంచిన ప్రభుత్వం... అధికారులకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2023-08-10 13:15:50.0  )
HYD:‌ మెట్రో రైల్ విస్తరణపై వేగం పెంచిన ప్రభుత్వం... అధికారులకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మెట్రో రైల్ విస్తరణపై ప్రభుత్వం వేగం పెంచింది. నగరం నాలుగువైపులా మెట్రో రైళ్లను ఏర్పాటు చేయాలని ఇటీవల కేబినెట్ ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయాలు ప్రకటించింది. ప్రస్తుతం మెట్రో రైల్ విస్తరణపై కసరత్తు చేస్తోంది.మాస్టర్ ప్లాన్‌పై దృష్టి సారించింది. ఈ మేరకు మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై సీఎస్, పలువురు అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. మెట్రో డిపోకు 48 ఎకరాల భూమిని అప్పగించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌ భవిష్యత్తుకు భారీగా మెట్రో విస్తరణ చేయాలన్నారు. మెట్రో విస్తరణతోనే హైదరాబాద్‌లో రద్దీ, కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. ప్రజా రవాణా బలోపేతంతోనే విశ్వనగరాలు తయారవుతాయని.. హైదరాబాద్ కూడా అలా మారాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed