మనం జీవించే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి : మంత్రి సీతక్క

by Aamani |
మనం జీవించే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి :  మంత్రి సీతక్క
X

దిశ, హిమాయత్ నగర్ : వాస్తవ పరిస్థితులను తెలుసుకొని జీవించాలని, మనం జీవించే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ప్రజా భవన్ లో మూసీ పునరావాసం పొందిన 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. మూసీ నీళ్లతో స్నానాలు చేసి తాగేలా పునర్ జ్జీవనం చేస్తామని తెలిపారు. మూసీ నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితుల్లోని ఒక్కో మహిళలకు రూ. రెండు లక్షలు ఇస్తున్నామని తెలిపారు. మూడేళ్లకు నెలకు రెండు వేల చొప్పునరూ. 60 వేలు చెల్లిస్తే చాలు అని తెలిపారు. ఒక్క లక్ష 40 వేలు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed