- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector : అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
దిశ, హైదరాబాద్ బ్యూరో : జిల్లాలో రెండు పడకల గదుల ఇండ్లతో పాటు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , రెవెన్యూ తదితర అంశాల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల వారీగా రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రెండు పడకల ఇండ్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, సికింద్రాబాద్ పరిధిలోని జమున నగర్, తార్నాక లలో అర్హులైన పేదలకు ఇండ్లు అందించే దిశగా రెండు పడకల ఇండ్ల పట్టాలను సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేసుకున్న దరఖాస్తుల ను పరిశీలించి నివాస,మరణ ధ్రువీకరణ పత్రాలు సత్వరమే అందించాలని అన్నారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని, ఒకవేళ ఉన్నట్లైతే అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ముకుంద రెడ్డి, డిఆర్ఓ వెంకటాచారి, ఆర్డీఓలు రామకృష్ణ, సాయిరామ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.