- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyderabad:నగరవాసులకు బిగ్ అలర్ట్..ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న భారీ వర్షం
Hyderabad:నగరవాసులకు బిగ్ అలర్ట్..ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న భారీ వర్షం
X
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. నగరంలో ఈ రోజు(గురువారం) ఉదయం ఎండగా, ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈ క్రమంలో రాత్రి నగరంలో జోరు వాన కురుస్తుంది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, పటాన్‌చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, అమీన్‌పూర్, అమీర్‌పేట్, మాదాపూర్, కూకట్ పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హైటెక్‌సిటీలో వర్షం దంచి కొడుతోంది. ఈ భారీ వర్షం మరో గంట నుంచి రెండు గంటల పాటు కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. అత్యవసరమైతే 040-21111111/9000113667 నెంబర్‌కి ఫోన్ చేయాలని GHMCకి చెందిన EVDM సూచించింది.
Advertisement
Next Story