చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

by srinivas |   ( Updated:2023-09-12 08:07:41.0  )
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి డాక్యుమెంట్స్ తన దగ్గర లేవని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పిన దాన్ని బట్టి చూస్తే అరెస్ట్ విధానం సరిగా లేదని తెలిసిందని తెలిపారు. ముందస్తు నోటీసులు, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని తనకు తెలిసిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed