- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hyd: చాలా రోజుల తర్వాత జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్న చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తమ నివాసానికి చేరుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 53 రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబుకు మంగళవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి తొలుత ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్లారు. ఈ రోజు మధ్యామ్నం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు.
అయితే హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీగా చంద్రబాబు వాహనం వెంట జూబ్లీహిల్స్‌కు వరకు చేరుకున్నారు. రోడ్డు పొడవునా జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు అభివాదం తెలిపారు. చంద్రబాబు జూబ్లీహిల్స్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు షరతులు ఉండటంతో చంద్రబాబు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా ఇంటికి చేరుకున్నారు. గురువారం ఆయన కంటికి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.