- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల ఖర్చు రూ. 4 వేల కోట్లా..?
దిశ, తెలంగాణ బ్యూరో: 9 ఏళ్లలో సీడీపీ నిధుల ఖర్చుపై ఎలాంటి అడిట్ జరగలేదని, నియోజకవర్గ అభివృద్ధి పనులపై జరిగిన రూ. 4 వేల కోట్ల ఖర్చును వెంటనే అడిట్ చేయాలని అప్పటివరకు అభివృద్ధి పేరిట నిధుల విడుదల నిలుపుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి కోరారు. బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ, మండలి సభ్యులకు నిధులు కేటాయిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు 2014-15 నుంచి 2022-23 వరకు సమారు రూ. 4 వేల కోట్లు నియోజకవర్గాల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు మంజూరు చేసిందన్నారు.
నియోజకవర్గంలో పనులు చేయడానికి ప్రభుత్వం విధివిధానాలను రూపొందించిందని, కానీ అందుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయన్నారు. దీంతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సూచించిన పనులను టెండర్ల ద్వారా చేయాలని ఉన్నా వారు సూచించిన వారికి నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తున్నారన్నారు. కాంట్రాక్టు పొందిన మద్దతు దారులు నాసిరకం పనులు చేస్తున్న సంబంధిత ఇంజనీర్లు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇలా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోవడం లేదని, చర్యలు సైతం తీసుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పేరిట జరుగుతున్న అవకతవకలు కప్పి పుచ్చుకోవడానికే ప్రభుత్వం నిధుల ఖర్చుపై అడిట్ చేయించడం లేదని అనుమానం కలుగుతోందన్నారు. 2023-24 బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లు ప్రత్యేక అభివృద్ధి పేరిట మంజూరు చేశారని, దీనిలో అధికభాగం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకే కేటాయించారన్నారు. వెంటనే అడిట్ నిర్వహించి ఆ నివేదికను ప్రజలకు తెలియజేయాలని కోరారు.