అత్యంత వైభవంగా రామాయణ కల్పవృక్షం ప్రారంభం

by Disha Web Desk 15 |
అత్యంత వైభవంగా రామాయణ కల్పవృక్షం ప్రారంభం
X

దిశ, శేరిలింగంపల్లి : సంగీత, నృత్య మహోత్సవం అయిన ‘రామాయణ కల్పవృక్షం’ను హైదరాబాద్‌ లోని సీసీఆర్టీ క్యాంపస్‌లో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ శుక్రవారం ప్రారంభించారు. ఈ ఉత్సవాలు మూడు రోజులు పాటు జరగనున్నాయి. ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు, పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్ (ఐఐఆర్టీఎస్, రిటైర్డ్), భారత ప్రభుత్వ ‌ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, శంకరానంద కళాక్షేత్ర నాట్యరంభ,

బృత్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి చెందిన కళాకారులు, వక్తలు పాల్గొంటున్నారు. ఇందులో క్లాసికల్ నుంచి పాపులర్ వరకు ఎన్నో ప్రదర్శనలు ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే చర్చలు, వర్క్‌షాప్‌లు, సంస్కృతం, డిజిటల్ కళలు, పుస్తక ఆవిష్కరణలు ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు.


Next Story