నగరంలో భారీ వర్షం... కొట్టుకుపోయిన కారు (వీడియో)

by S Gopi |   ( Updated:2023-05-19 12:19:10.0  )
నగరంలో భారీ వర్షం... కొట్టుకుపోయిన కారు (వీడియో)
X

దిశ, ఎల్బీనగర్: నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి కురిసిన కుండపోతా వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే మంగళవారం ఉదయం ఎండ దంచి కొట్టిన సాయంత్రం ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఎడతెరిపిలేని వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం, వనస్థలిపురం, మన్సూరాబాద్, సాహెబ్ నగర్, ఆటోనగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో ఆటోనగర్ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ వద్ద మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి వెంటనే స్పందించి ప్రత్యక్షంగా ఘటనా స్థలికి చేరుకుని అధికారులను అలర్ట్ చేశారు. జీహెచ్ఎంసీ, ఆర్డీఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసుల సహాయంతో చర్యలు చేపట్టారు. ఇక హయత్ నగర్ బంజారా కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా స్టేట్స్ కళ్యాణి బ్లాకులో ప్రహరీ గోడ కూలి ఇంట్లోకి వరద నీరు చేయడంతో రూ. లక్షకు పైగా ఆస్తి నష్టం జరిగింది. కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు నష్టపరిహారం అందజేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story