పీవీ ఇప్ప‌టిత‌రం రాజ‌కీయ నాయ‌కుల‌కు స్ఫూర్తిదాయ‌కం

by Naresh |
పీవీ ఇప్ప‌టిత‌రం రాజ‌కీయ నాయ‌కుల‌కు స్ఫూర్తిదాయ‌కం
X

దిశ‌, ర‌వీంద్ర‌భార‌తి: పీవీ న‌ర్సింహారావు ఇప్ప‌టిత‌రం రాజ‌కీయ నాయ‌కుల‌కు స్ఫూర్తిదాయకం అని ఐటీ శాఖ మంత్రివ‌ర్యులు దుద్దిళ్ళ శ్రీధ‌ర్ బాబు అన్నారు. మాజీ భార‌త ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు భార‌త‌రత్న పుర‌స్కారం వ‌చ్చిన సంద‌ర్భంగా తెలంగాణ బ్ర‌హ్మ‌ణ సంఘాల ఆధ్వ‌ర్యంలో ఆదివారం ర‌వీంద్ర‌భార‌తిలో పుర‌స్కారం స‌భ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీధ‌ర్‌భాబు మాట్లాడుతూ…. పీవీ న‌ర్సింహారావుకు భార‌త‌ర‌త్న పుర‌స్కారం రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, విద్యా శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు గురుకులాల‌ను స్థాపించార‌ని పేర్కొన్నారు. పీవీ గొప్ప మేధావి అని, మా నాన్న శ్రీపాద రావు పీవీ శిష్యుడుగా పేరుగాంచ‌న‌డ‌న్నారు.

1992లో దూర‌దృష్టితో సాఫ్ట్‌వేర్ పార్కు ఏర్పాటు చేయ‌డంతో ఇప్ప‌డు రెండు ల‌క్ష‌ల 30 వేల కోట్ల డాల‌ర్లు ఎగుమ‌తులు అవుతున్నాయ‌ని తెలిపారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు భూ ప‌రిమితి చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టి త‌న వంద‌ల ఎక‌రాల భుముల్నీ ధారాద‌త్తం చేసిన మ‌హ‌నీయుడని.. బ్ర‌హ్మణుల అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, మీ స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్కారించేలా చూస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అనంత‌రం పీవీ కుమార్తె శార‌ద‌మ్మను మంత్రి శ్రీధ‌ర్‌బాబు స‌న్మానం చేసి స‌త్కారించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, ప్రభుత్వ స‌ల‌హాదారు హ‌ర్కార వేణుగోపాల్‌, ఎమ్మెల్యే మ‌క్క‌న్‌సింగ్ రాజ్ ఠాగూర్‌, పీవీ ప్ర‌భాక‌ర్‌రావు, పీవీ సుభాష్‌, తెలంగాణ బ్ర‌హ్మ‌ణ సంఘాల జేఏసీ క‌న్వీన‌ర్ జ‌మాలాపుర‌పు శ్రీనివాస్‌, చ‌ల‌కిలం అనిల్‌, ర‌జినీ రావు, డా. ప‌వ‌న్ కుమార్ శ‌ర్మ‌, గూడ రాజేశ్వ‌ర‌రావు, ల‌త‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed