మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

by Mahesh |   ( Updated:2023-08-29 06:32:55.0  )
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
X

దిశ, ఖైరతాబాద్: మసాజ్ కేంద్రాలు, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న రెండు కేంద్రాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని హెవెన్ ఫ్యామిలీ స్పా ఇంకా అదే మార్గంలో ఉన్న ది వెల్వెట్ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం పట్టుబడ్డ 17 మంది యువతులను రెస్క్యూ చేసి పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్. కార్తీక్, జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్, బాషాలపై కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story