- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ చేరుకున్న మోదీ.. ఘన స్వాగతం పలికిన నేతలు
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళి సైతో పాటు హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని సైతం ప్రధాని మోదీని ఘనంగా స్వాగతించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు. అనంతరం పాలమూరు పర్యటనకు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి పాలమూరుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో పాలమూరుకు వెళ్లనున్నారు. అక్కడ రూ.13, 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయయనున్నారు. ఇక మోదీ పర్యటనతో పాలమూరులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పాలమూరు బహిరంగ సభ ప్రదేశంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ రోజు పాలమూరు పర్యటన అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లి మళ్లీ తిరిగి మంగళవారం తెలంగాణకు రానున్నారు.