పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్

by Disha Web Desk 11 |
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి :  కలెక్టర్
X

దిశ,కార్వాన్ : ఈ నెల మే 3 మంది 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ హక్కును ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ ఆబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్ లో ఏర్పాటుచేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ..

ఈ నెల మే 3వ తేదీ నుంచి మే 8 వరకు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్రాగునీటి సౌకర్యం, టెంట్, ఎయిర్ కూలర్లు, మజ్జిగ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటాచారి, ఆర్ డి ఓ కే .మహిపాల్ రెడ్డి,నోడల్ అధికారి రమేష్, ఏఆర్వోలు ప్రేమ్ కుమార్, జయమ్మ, చంద్రశేఖర్, జయశ్రీ, నిహారిక తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed