- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: హైదరాబాద్‌లో పబ్‌లపై రైడ్స్.. 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పబ్సులపై పోలీసులు దాడులు చేశారు. శనివారం రాత్రి 25 పబ్‌ల్లో ఎక్సైజ్, నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో ఉన్నవారికి డ్రగ్స్ డిటెక్టివ్ కిట్‌లతో శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం 50 మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని విచారించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. పబ్బులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది. ప్రధానంగా పబ్బుల్లో యువత, యువకులు డ్రగ్స్ సేవిస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు చేసిన తనిఖీల్లో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం డ్రగ్స్ సేవిస్తు్న్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పలువురిని అరెస్ట్ చేసినా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. నగరంలో మాత్రం విచ్చలవిడిగా డగ్స్ లభ్యమవుతోంది. దీంతో యువత డ్రగ్స్‌కు బానిసవుతున్నారు. డ్రగ్స్ సేవించిన మత్తులో దారుణాలను సైతం పాల్పడిన ఘటనలు నమోదు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు మాత్రం డగ్స్, గంజాయి, మత్తుపదార్థాలను రూపుమాపేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో 25 పబ్బుల్లో తనిఖీలు చేశారు. మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.