- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఈటీ పోస్టులను పెంచాలి
దిశ, సికింద్రాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో పీఈటి పోస్టులను పెంచాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎస్ఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు బైఠాయించిన విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యకుడిగా శాగంటి రాజేష్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీలో పీఈటి, పీడీ, పోస్టులు 182 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 పీఈటి, పీడీ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 182 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం బాధాకరమన్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఖాళీగా ఉన్న అన్ని పీఈటి, పీడీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోస్టులను పెంచే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.