నాంపల్లి రెడ్ హిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం.. అద్దెతో పాటు కరెంటు బిల్లు డ్యూ

by Aamani |
నాంపల్లి రెడ్ హిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం.. అద్దెతో పాటు కరెంటు బిల్లు డ్యూ
X

దిశ,కార్వాన్ : నాంపల్లి రెడ్ హిల్స్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఇంటి యజమాని కరెంట్ కట్ తో పాటు తాళం వేయడంతో మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే రెడ్ హిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తో పాటు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా గత 20 ఏళ్లుగా ఇంతియాజ్ ఖురేషి కి చెందిన భవనంలో అద్దె కొనసాగుతుంది. అయితే గత ఏడు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో నిత్యం ఖురేషి సబ్ రిజిస్టర్ అధికారులను ప్రశ్నించినప్పటికిని ప్రయోజనం లేకపోవడంతో బుధవారం అర్ధరాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేసి మీటర్ బాక్స్ లోని ఫీజులు తొలగించాడు.

అంతేకాకుండా నీరు సరఫరా కాకుండా నిలిపివేశాడు. కాగా శుక్రవారం ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తెరిచేందుకు వచ్చిన సిబ్బంది తాళాలను చూసి ఖంగుతిన్నారు. వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి తెలపడంతో రెంట్ కట్టేంతవరకు తాళాలు తీసేది లేదని భీష్మించి కూర్చున్నాడు. ఈ క్రమంలో అధికారులు స్పందించి వెంటనే అద్దెను చెల్లిస్తామని తెలపడంతో మధ్యాహ్నం తలుపులు తెరిచాడు. ఈ క్రమంలో లోనికి వెళ్లేసరికి విద్యుత్ కూడా లేకపోవడంతో కొంతసేపు చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి యజమానిని సముదాయించి వెంటనే చెల్లిస్తామని తెలపడంతో ఇంటి యజమాని విద్యుత్ సరఫరా తో పాటు నీటి సరఫరా కూడా చేశాడు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఇంటి యజమాని హుకుం జారీ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed