ఆరోగ్యశ్రీ, చేయూత పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

by Sumithra |
ఆరోగ్యశ్రీ, చేయూత పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
X

దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ - చేయూత పథకాన్ని, మమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకాన్ని ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రతిమ సింగ్, శేరిలింగంపల్లి డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మల్లికార్జున్, డిప్యూటీ డీఎం హెచ్ ఓ డాక్టర్ సృజన, హెచ్ సీయూ డిపో మేనేజర్ మురళీధర్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం ద్వారా గతంలో ఉన్న రూ.5 లక్షల పరిమితిని ప్రస్తుతం రూ. 10 లక్షల వరకు పెంచినందు వల్ల ఈ సదుపాయాన్ని నియోజక వర్గంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలు, తెల్లరేషన్ కార్డులు కలిగిన పేదలు ఉపయోగించుకుని ఆరోగ్య కరమైనా జీవితాన్ని కొనసాగించాలని అన్నారు. 1672 ప్యాకేజీలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కవర్ చేయబడతాయని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారని తెలిపారు.

గతంలో తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వైద్యంకు పెద్ద పీట వేస్తామని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 28 బస్తీ దవాఖానాలు ఏర్పటు చేసుకొని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో భాగంగా రిబ్బన్ కట్ చేసి ఉచిత బస్ టికెట్లను మహిళలకు అందచేశారు గాంధీ. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా మానవతా దృక్పథంతో దివ్యాంగులకు, వృద్దులకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించాలని, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని పేదప్రజలు అందరు వినియోగించుకోవాలని, ఆరోగ్య కార్యకర్తలు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చందర్ కార్పొరేటర్లు శ్రీ రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జగదీశ్వర్ గౌడ్, గౌరవ మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగరావు, హాస్పిటల్ స్టాఫ్, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed