మంత్రి తలసాని ప్రోటోకాల్ నిబంధనలు ఉలంగిస్తూ స్వార్థ రాజకీయాలు పాల్పడుతున్నారు : కార్పొరేటర్

by Sumithra |
మంత్రి తలసాని ప్రోటోకాల్ నిబంధనలు ఉలంగిస్తూ స్వార్థ రాజకీయాలు పాల్పడుతున్నారు : కార్పొరేటర్
X

దిశ, బేగంపేట : మంత్రి తలసాని సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ నుండి గెలుపొందిన కార్పొరేటర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని రామ్ గోపాల్ పేట కార్పొరేటర్ చీరసుచిత్ర, సీనియర్ బీజేపీ నాయకులు చీర శ్రీకాంత్ ఆరోపించారు. సోమవారం పాన్ బజార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ కార్పొరేటర్లకు దూరం పెడుతున్నారని వారు మంత్రి పై ధ్వజమెత్తారు. అధికారులు నిలదీస్తే అధికారులకు మంత్రి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. మంత్రి చేస్తున్నా రాజకీయాలు బెదిరింపులకు భయపడేది లేదని వారు తేల్చిచెప్పారు. నియోజవర్గంలో ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా ఓడిపోయిన కార్పొరేటర్లతో అభివృద్ధి శంకుస్థాన కార్యక్రమాలు చేపట్టడం ఇది మంచి పద్ధతి కాదని మంత్రిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తానని పదేపదే చెప్పిన మంత్రిఎన్నికల అనంతరం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు. ఇటీవల కలాసిగూడలో నాలాలో మృతి చెందిన మౌనిక సంఘటన మంత్రి రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. నష్టపరిహారం అందించే సమయంలో స్థానిక కార్పొరేటర్ ను వెంటబెట్టుకోకుండా ఓడిపోయిన కార్పొరేటర్ తీసుకెళ్లి బాధితులకు నష్టపరిహారం అందించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఇలాగే మంత్రి నియోజకవర్గంలో కొనసాగితే నియోజకవర్గం ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని ఆరోపించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున తాను పోటీ చేస్తానని చీర శ్రీకాంత్ వెల్లడించారు. తమ పార్టీ అధిష్టానం ఎవరి కేటాయించిన బీజేపీ గెలుపునకు తనవంతు కృషి చేస్తానని చీర శ్రీకాంత్ తెలిపారు.



Next Story