- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐదారు నెలల్లో వాళ్లు జైలుకే.. కాంగ్రెస్ తీవ్ర హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో గెలిచుకునేందుకు వ్యూహ రచనలు చేస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా మరోసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చూపాలని ప్రయత్నిస్తుంది. అటు అధికార పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని పరువు కాపాడుకోవాలని చూస్తోంది. అటు బీజేపీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి లోక్‌సభలో ఆధిపత్యం కొనసాగించాలని చూస్తోంది. దీంతె ఈ మూడు పార్టీల ఇప్పటి నుంచి ఎన్నికల హడావుడి చేస్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రతినిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుకుంటున్నారు. గత టీఆర్ఎస్ హయాంలో ఎక్కడి చూసినా అవినీతేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అవినీతిని వెలికితీసేందుకు సిద్ధమవుతోంది.
అటు బీఆర్ఎస్ నేతలు సైతం ఎన్నికలకు సై అంటున్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, హరీవ్ రావు లాంటి నేతలు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించిన మంత్రి కేటీఆర్.. కారు వెళ్లింది సర్వీసుకు మాత్రమే షెడ్యుకు కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో జరిగిన సంఘటనలపై కాంగ్రెస్ పార్టీదే తప్పును చూపుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ మాత్రం గత ప్రభుత్వంలో అక్రమాలపై దూకుడు పెంచింది. ఇప్పటికే ఫైళ్ల మాయం కేసులాంటివి తెరపైకి తెచ్చింది. మరిన్ని కేసులు తప్పవని హెచ్చరించింది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై మాట్లాడుతున్న వాళ్లు ఐదారు నెలల్లో తీహార్ జైల్లో ఉంటారని హెచ్చరించారు. కారు వెళ్లింది స్కీరీసింగ్‌కు కాదని, స్కీప్‌కని మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మరి కాంగ్రెస్ వ్యాఖ్యaపై బీఆర్ఎస్ స్పందన ఏంటనేది చూడాలంటే ఆగాల్సిందే.