- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
దిశ, కార్వాన్ : మే 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే భరోసా బహిరంగ సభ వాల్ పోస్టర్ ను లకడికాపూల్ లోనీ బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. దేశాన్ని రక్షించాల్సిన మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
రిజర్వేషన్ల తొలగింపు ప్రకటనను బీఎస్పీ ఖండిస్తున్నదని తెలిపారు. అవసరమైతే వారి రిజర్వేషన్లు పెంచాలనీ అన్నారు. వెంటనే అమిత్ షా తన వ్యాఖ్యాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1994 తెలంగాణకు చెందిన జి.కృష్ణయ్య బీహార్ లో హత్యకు గురికాగ ఆనంద్ మోహన్ అనే దోషిని జైలుకు పంపారు. అయితే నితీష్ కుమార్ ప్రభుత్వం నిబంధనలు మార్చి బయటకు తీసుకొచ్చే కుట్ర చేస్తుందనీ, ప్రజల ఓట్లతో గెలిచినవారైతే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.