- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో భూ వివాదంలో మల్లారెడ్డి
దిశ, హిమాయత్ నగర్ : నిత్యం వివాదాల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ దోమల్ గూడ కి చెందిన కళ్లెం నర్సింహా రెడ్డి భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మనోవేదనకు గురి చేస్తున్నారని బాధిత రైతు 87 ఏళ్ల వృద్ధుడు కళ్ళెం నరసింహారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్ పేట మండలం, యాడారం గ్రామంలో సర్వే నెంబర్ 249, 250 (ఏ) లలో 23.26 ఎకరాల భూమి ఉందని, 1982 సంవత్సరంలో కష్టార్జితంతో ఈ భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ఈ భూమిని తాను కొంటానంటూ మల్లారెడ్డి
బంధువుల ద్వారా పలుమార్లు తనను అడగడం జరిగిందని చెప్పారు. అందులో నుండి మొదట మొత్తం భూమి కొనుగోలు చేస్తానని చెప్పిన మల్లారెడ్డి అనంతరం 9.29 ఎకరాలు కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఒక్కో ఎకరానికి 2.25 కోట్ల రూపాయలు..9.29 ఎకరాలకు గాను మొత్తం రూ. 21.88 కోట్లకు ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. అందుకుగాను ఇరువురం ఎంఓయూ అగ్రిమెంట్ చేసుకున్నామని.. అనంతరం విడతల వారీగా రూ. 8.03 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు. మిగతా 14 కోట్లు చెల్లించకుండా తర్వాత ఇస్తానని నమ్మించి మల్లారెడ్డి తన కొడుకు మహేందర్ రెడ్డి కంపెనీ అయిన సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.
రూ.14 కోట్ల కు గాను మహేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్చె క్కులు ఇచ్చారని, అవి చెక్ బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు. గత 40 రోజులుగా డబ్బులు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు నర్సింహా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బంధువే కదా అని నమ్మితే.. ఇప్పుడు మోసం చేసాడని బాధిత వృద్ధుడు భావోద్వేగానికి లోనయ్యారు. మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు రూ. 14 కోట్లతోపాటు ఆరు మాసాలకు గాను నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.