పోక్సో కేసులో జీవిత ఖైదు

by Disha Web Desk 11 |
పోక్సో కేసులో జీవిత ఖైదు
X

దిశ, మెహిదీపట్నం: పోక్సో కేసులో న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధించినట్లు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ వెల్లడించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. లంగర్ హౌస్ లోని గాంధీ విగ్రహం సమీపంలో ఉండే అతిక్ ఖాన్ బైకు మెకానిక్ గా పనిచేస్తుండేవాడు. ఇదిలా ఉండగా 2021లో అతడు ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. అప్పటి ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్ కేసు నమోదు చేసి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు.

ఈ మేరకు కేసును విచారించిన నాంపల్లి మెట్రోపాలిటన్ 12వ అడిషనల్ న్యాయమూర్తి టీ. అనిత మంగళవారం నిందితుడికి జీవిత కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. అత్యాచార కేసుల్లో బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించడం లేదని ఇన్స్పెక్టర్ రఘు కుమార్ పేర్కొన్నారు. బాధితులు నిర్భయంగా పోలీసులను ఆశ్రయిస్తే నిందితులకు కఠిన కారాగార శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. పరువు పోతుందని ఉరుకుంటే నేరస్తులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రఘు కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నేరం చేసిన నిందితులు చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదన్నారు.



Next Story