- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు
దిశ, అంబర్ పేట్: శోభకృత్ నామ ఉగాది నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా విరాజిల్లుతుందని ప్రముఖ వేద పండితుడు సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో శోభకృత్ ఉగాది వేడుకల సందర్భంగా సంతోష్ కుమార్ శాస్త్రిచే పంచాంగ పఠనం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్, పర్యటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రసమయి బాలకిషన్ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కెవి రమణచారి, డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం పఠనం చేస్తూ.. శుభకృత్ సంవత్సరం శుభాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సంవత్సరంలో భారత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. పరిశోధన, విద్య, సాంస్కృతిక రంగాలకు అద్భుతంగా ఉందన్నారు. విద్యా రంగాలపై నూతన పరిశోధనలు జరుగుతాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం సుస్థిర పరిపాలన అందించబోతుందన్నారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా సకాలంలో కురిసి కాళేశ్వరం, నాగార్జున సాగర్ తోపాటు అన్ని ప్రాజెక్టులు నిండుతాయన్నారు. వైరల్ ఫీవర్ తోపాటు కరోనా అంతరించిపోతుందన్నారు. మీడియా, టీవీ పరిశ్రమలకు వార్తలు సృష్టించకుండా అద్భుతమైన వార్త విశేషాలు అందుతాయన్నారు. రైతులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పంటలు పండుతాయని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. శోభకృత్ సంవత్సరం అన్ని రంగల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నారు. ఉగాది పండుగ అందరి జీవితాలలో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతాపరుద్ర వైభవం సాహిత్య రూపకం, కవి సమ్మేళనంతోపాటు వివిధ నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.