- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం: కోట శ్రీనివాస్ గౌడ్
దిశ, సికింద్రాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయమని ఓయూ జేఏసీ,తెలంగాణ ఉద్యమ నాయకులు, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహకులు కోట శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాచరిక పోకడలతో ఉన్న రాష్ట్ర రాజ ముద్రను తొలగించి తెలంగాణ ప్రజల త్యాగాలకు చిరునామాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజముద్రను ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. రాజముద్ర తో పాటు, ప్రజా ఉద్యమ ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా రాష్ట్ర గీతం ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే ఆయన పట్ల విమర్శలు చేయడం కోట శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్ధి ప్రజా పోరాటాల ద్వారా సాధించుకున్న *తెలంగాణ అస్తిత్వ పోరాటానికి చిహ్నం టీజీ అని, కేసీఆర్ దాన్ని తీసేసి టిఎస్ గా పెట్టడం బాధాకరం అన్నారు. తెలంగాణలో ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక పోరాట చరిత్ర ఉందని, దానిని తుడిపేసి ఎటువంటి శాస్త్రియ పరమైన చర్చ లేకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాల చరిత్రను, ఆస్తిత్వాన్ని కేసీఆర్ తన పాలనలో ధ్వంసం చేసాడన్నారు. కేసీఆర్ ఎంచుకున్న రాజముద్రలో, తెలంగాణ తల్లి విగ్రహంలో ఎక్కడ కూడా ప్రజల ఉద్యమ, మట్టి తల్లుల ఆనవాళ్లు ప్రతిబింభించలేదన్నారు.
తెలంగాణలో ఆణువణువూ అమరుల త్యాగల గుర్తులే కనబడతాయని, అలాంటి గుర్తులు లేని రాచరికపు పోకడలు ఉన్న రాజ ముద్ర ఎందుకని ప్రశ్నించారు. దొర అహంకారం ఒక దళితుడు రాసిన పాటను పదేండ్లు రాష్ట్ర గీతంగా లేకుండా ప్రజల్ని మభ్యపెట్టాడని చెప్పారు. గతంలో జయ జయహే గీతాన్ని రమణ అనే రాయలసీమ అతనితో కేసీఆర్ పాడించాడని గుర్తు చేశారు. గడిచిన పదేండ్లలో సీమాంద్ర పెట్టుబడే రాష్ట్రాన్ని శాశించిందని, బీఆర్ఎస్ భవన్ కట్టే పని శ్రీకాకుళం మేస్త్రీలకిచ్చిన కేసీఆర్, సచివాలయం కాంట్రాక్ట్ మధ్యప్రదేశ్ కాంట్రాక్టర్‌కి, యాదగిరిగుట్ట పునరుద్ధరణ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి, కాళేశ్వరం కాంట్రాక్ట్ మేఘా కృష్ణారెడ్డికి అప్పగించారన్నారు.
ఏ ప్రాంతం అని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను పెట్టారో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు కోరుకున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ముందుకు పోతుంటే కుట్రలు మొదలు పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో భుజంగ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ను పక్కదారి పట్టించి , కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లను కాపాడే ప్రయత్నంలో కొందరు యూట్యూబ్ , ఫేస్ బుక్ లో ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను దాని వెనుక ఉన్న నాయకులందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంచాల సతీష్, వెంకట్ నాయక్, పవన్ , జశ్వంత్, కొరివి బాలకృష్ణ, నాంపల్లి వెంకటరమణ, రాము, కొంపల్లి వినయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు