Inspire Awards : ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ 2024 - 25 కోసం దరఖాస్తుల ఆహ్వానం..

by Sumithra |
Inspire Awards : ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ 2024 - 25 కోసం దరఖాస్తుల ఆహ్వానం..
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ 2024-25 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సీ.ధర్మేందర్ రావు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారిని ఆర్.రోహిణి ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అన్ని సబ్జెక్ట్ గైడ్ ఉపాధ్యాయులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడారు. ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024 - 25 నామినేషన్స్ ఈ నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు న్యూ ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతి ఏటా అవకాశం కల్పిస్తుందన్నారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఒక ఐడియా బాక్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా సమస్య, సాధన, పరిష్కారం గురించి చర్చించి వారి వినూత్న ఆలోచనలను పేపర్ పై రాసి ఐడియా బాక్స్ లో వేయాలన్నారు.

ప్రతి పాఠశాల నుండి ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి పాఠశాలకు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థుల ప్రాజెక్ట్ రైట్ అప్స్ ( ప్రాజెక్ట్ వివరాలు) సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. రిసోర్స్ పర్సన్ డాన్ హై స్కూల్ సైన్స్ టీచర్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్లే స్టోర్ నుంచి ఇన్ స్పైర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా స్టూడెంట్ నామినేషన్ సులభంగా చేసుకోవచ్చన్నారు. నామినేషన్ ప్రక్రియ ఆన్ లైన్ లో చేసుకొనే పద్దతిని ఆయన వివరించారు. నవం ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ విద్యార్థులలో ఇన్నోవేషన్స్ ఎలా రాబట్టాలి, బ్రెయిన్ స్ట్రామింగ్, డిజైన్ థింకింగ్ ఫై గూగుల్ మీట్ లో తెలిపారు . గూగుల్ మీట్ లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.



Next Story