జూబ్లీహిల్స్ లో జాతీయ జెండాకు అవమానం

by Kalyani |
జూబ్లీహిల్స్ లో జాతీయ జెండాకు అవమానం
X

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ , వెంగళరావు నగర్ లో జాతీయ జెండాకు అవమానం జరిగింది అని స్థానికులు వాపోతున్నారు. 26 వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెంగళరావు నగర్ లో మాజీ ఎన్ ఎస్ యు ఐ నాయకులు కుందన్ యాదవ్ తదితరులు జాతీయ జెండా ని ఎగరవేశారు. జాతీయ జెండాను ఆరోజు సూర్యాస్తమయం అయ్యేలోపు కిందకి దించాలి కానీ.. వెంగళరావు నగర్ లో కుందన్ యాదవ్ బృందం ఎగరవేసిన జెండా తీయలేదు..మూడు రోజుల పాటు జాతీయ జెండా అట్లానే ఉండటం తో మధుర నగర్ పోలీసులు వచ్చి జెండా ని కిందకి దించారు. జాతీయ జెండా ని కుందన్ యాదవ్ అవమానించారు అంటూ పలువురు మండిపడుతున్నారు. జాతీయ జెండాకు అవమానం చేసిన కుందన్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed