ఇకపై చెత్త వేస్తే.. సైరన్ సౌండ్.. జరిమానా! జీహెచ్ఎంసీ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
ఇకపై చెత్త వేస్తే.. సైరన్ సౌండ్.. జరిమానా! జీహెచ్ఎంసీ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (జీవీపీ)ను శాశ్వతంగా పరిష్కరించేందుకు వినూత్న టెక్నాలజీని జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అమలు చేస్తోంది. ప్రజలు జీవీపీ వద్ద పదేపదే చెత్త వేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీన్ని నివారించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక చెత్త వేయడం మొదలైనప్పుడు సైరన్ లాంటి సౌండ్ వస్తుంది. ఈ విధానం వల్ల చెత్త వేయడాన్ని గుర్తించి అధికారులు జరిమానా విధించనున్నారు.

ఉప్పల్ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు పర్యవేక్షణలో ఈ టెక్నాలజీ అమలు చేయబడుతుంది. నగరంలో గార్బేజ్ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించి, ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచడంలో టెక్నాలజీ ఎంతో మేలు చేస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాలను బుధవారం ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పంచుకుంది. ఈ మేరకు తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులతో చర్చలు జరిపినట్లు ట్వీట్ చేసింది.

కాగా, నగరంలో రోడ్లపై వేస్తున్న చెత్తను తొలగిస్తున్న మళ్లీ మళ్లీ వేస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. జీవీపీల వద్ద గతంలో డస్ట్ బిన్స్ ఉండేవి. డస్ట్ బిన్ లెస్ సిటీగా మార్చేందుకు అధికారులు వాటిని తొలగించారు. అయితే, స్థానికులు మాత్రం డబ్బాలు లేకపోయినా.. జీవీపీ పాయింట్ల వద్దనే చెత్తను వేస్తున్నారు. ఈ క్రమంలోనే చెత్త వేస్తున్న చోట జీహెచ్ఎంసీ లిట్టర్ కంట్రోల్ కాషన్ కెమెరా, ఆ పక్కనే మైక్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉప్పల్ సర్కిల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ పద్దతిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే నగరమంతా వ్యాప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed