- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రేటర్ లో భారీ వర్షం
దిశ, హైదరాబాద్ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం ప్రజలకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. రాత్రి సమయంలో నల్లటి మబ్బులతో గంట పాటు భారీ వర్షం కురియడంతో కాలనీలు , రోడ్లపై వర్షం నీరు చేరింది. కొన్ని కాలనీల రోడ్లు నీటితో మునిగిపోగా వర్షం
నీటిలో ఎక్కడ మ్యాన్ హోల్స్ తీసి ఉన్నాయో తెలియక చాలా చోట్ల రోడ్లు దాటేందుకు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వాతావరణ శాఖ కూడా గ్రేటర్ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని సూచించింది. ఇదిలా ఉండగా గ్రేటర్ పరిధిలో సగటున 7 నుండి 8 సెంమీ వర్షాపాతం నమోదైంది.
ట్రాఫిక్ జాం....
నల్లటి మేఘాలతో నగరంలోని పలు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయాలకు సెలవు దినం అయినప్పటికీ ఇండ్ల నుండి బయటకు వచ్చిన వారు వర్షంతో ఇబ్బందుల పాలయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎంజే మార్కెట్, ఉప్పల్ తదితర ప్రాంతాలలో రోడ్లపై ట్రాఫిక్ జాం ఏర్పడడంతో వాహనదారులు గంటల పాటు నరకం అనుభవించారు. ఓ వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జాం వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది.
రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు...
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై గుంతల్లో నీరు నిలిచి పోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట, అంబర్ పేట్, ఉప్పల్, బండ్లగూడ , తార్నాక, ఎల్బీ నగర్ , నాగోల్, దిల్సుఖ్ నగర్ ,కొత్తపేట ప్రాంతాలలో కురిసిన వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం...
రెండు రోజులుగా వదల కుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గంటల పాటు కరెంటు నిలిచి పోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. విద్యుత్ సరఫరా కోసం ఫ్యూజ్ ఆఫ్ కాల్ కు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఓ వైపు వర్షం, మరో వైపు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు.
- Tags
- Heavy rain