పాతబస్తీలో ఘనంగా తీజ్​ ఉత్సవాలు

by Sridhar Babu |
పాతబస్తీలో ఘనంగా తీజ్​ ఉత్సవాలు
X

దిశ, చార్మినార్​ : చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో జంగమెట్ డివిజన్ రవీంద్ర నాయక్ కాలనీలో ఆదివారం గిరిజన సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులందరికీ తీజ్​ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షహజాదీ మాట్లాడుతూ శ్రావణ మాసంలో గిరిజన మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్​ పండుగ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర నాయక్ నగర్ కాలనీ అధ్యక్షులు కృష్ణ నాయక్, జంగమ్మెట్​ డివిజన్ బీజేపీ అధ్యక్షులు జగదీష్, తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గసభ్యుడు గోపి నాయక్, రాజేష్ నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story