Bela Mutyalamma temple : బేలా ముత్యాలమ్మ దేవాలయంలో ఘనంగా చప్పన్​భోగ్​..

by Sumithra |
Bela Mutyalamma temple : బేలా ముత్యాలమ్మ దేవాలయంలో ఘనంగా చప్పన్​భోగ్​..
X

దిశ, చార్మినార్​ : ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా బేలా శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో శుక్రవారం చప్పన్​ భోగ్​ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్​ పొటేల్​ కృష్ణయాదవ్​, ఆలయ అధ్యక్షుడు పొటేల్​ సదానంద్​ యాదవ్​ల సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్దపెట్టున సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. చప్పన్​ భోగ్​ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి 56 రకాల స్వీట్లతో పాటు 13 రకాల డ్రై ఫ్రూట్స్​, 12 రకాల పండ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.



Next Story