జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న గంజాయి పెడ్లర్ అరెస్టు…

by Kalyani |
జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న గంజాయి పెడ్లర్ అరెస్టు…
X

దిశ, కార్వాన్: హైదరాబాద్ కోఠి లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్ లకు గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు శుక్రవారం రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ పై గతంలో ఐదు కేసులు నమోదు అయినట్లు పోలిసులు తెలిపారు. శుక్రవారం ఉదయం కోఠి లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లు అయిన డాక్టర్ కె. మణికందన్ డాక్టర్ వి. అరవింద్ లు గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన జూనియర్ డాక్టర్ లు టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ లో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వారి వద్ద నుండి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు జూనియర్ డాక్టర్ లతో పాటు గంజాయి పెడ్లర్ ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story