ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు.. కాంగ్రెస్‌కు హరీశ్ కీలక సూచన

by srinivas |
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు.. కాంగ్రెస్‌కు హరీశ్ కీలక సూచన
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (Brs) హయాంలో ఖైరతాబాద్ గణేశ్ (Khairatabad Ganesh) ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని మాజీ మంత్రి హరీశ్ (Former Minister Harish Rao) గుర్తు చేశారు. మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav)‌తో కలిసి ఖైరతాబాద్ గణేశుడిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం మనదని, ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.

కాగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో గణేశ్ మండపం పరిసరాలు కిక్కిరిపోయాయి. 70 అడుగులతో రూపుదిద్దుకున్న గణేశుడిని దర్శించుకుంటున్నారు. నగరానికి చెందిన రాజకీయ నాయకులే కాదు, ప్రముఖులు సైతం వినాయకుడి సేవలో పాల్గొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed