చేనేత కులాలను సమైక్య పరచేందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు : బండారు ఆనంద ప్రసాద్

by Aamani |
చేనేత కులాలను సమైక్య పరచేందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు : బండారు ఆనంద ప్రసాద్
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న చేనేత కులాల వ్యక్తులను సమైక్య పరచి పరస్పరం సహకరించుకునేందుకు గాను వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను అమెరికాలో ఏర్పాటు చేసినట్లు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనంద ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం కాచిగూడలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు బసబత్ని రాజేశం అధ్యక్షతన హైదరాబాద్ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

దేశంలో నివసిస్తున్న వివిధ చేనేత కులాల వ్యక్తులను సమైక్య పరిచి సామాజికంగా, ఆర్ధికంగా పరస్పరం సహకరించుకునేందుకు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ లోని వివిధ చేనేత కులాల సంఘాలను ఐక్యం చేయాలనేది తమ సంకల్సమన్నారు . ఈ కార్యక్రమంలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ కర్నాటి అంజన్ , టీఆర్పీఎస్ అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ , డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed