- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hyd: చిన్న పిల్లలకు బిగ్ అలర్ట్.. ఈ చాక్లెట్స్ అసలు తినొద్దు.. !
దిశ, రాజేంద్రనగర్: కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న కేటుగాళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కొన్ని రోజులుగా కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లేట్స్ తయారు చేసి విక్రయిస్తూ లక్షల డబ్బు సంపాదిస్తున్నారు. కేటుగాళ్ళు చాక్లెట్ల తయారీకి ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. కుళ్లిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్స్‌లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తూ చిన్న పిల్లలను ఆకర్షిస్తున్నారు.
అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి కానీ, స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల నుంచి నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం గమనార్హం. మురుగునీటి ప్రవాహంలో అత్యంత దుర్ఘంధంలో చాక్లెట్లు తయారు చేయడం తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. డబ్బులకు కక్కుర్తి పడిన కేటుగాళ్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు అడ్డాపై దాడి చేసి ముడి సరుకులు, యంత్రాలను సీజ్ చేశారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.