HYD: విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు.. డాక్టర్ల సూచనలు, సలహాలు ఇవే..!

by srinivas |   ( Updated:2023-09-06 12:27:11.0  )
HYD: విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు.. డాక్టర్ల సూచనలు, సలహాలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ను వైరల్ పీవర్స్ వణికిస్తున్నాయి. జంట నగరాల్లో జ్వరాలు విజృంభించాయి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులు కిటకిటలాడుతున్నారు. ఒక్కసారిగా వైరల్ ఫీవర్ కేసులు విపరీతంగా పెరగడంతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్ ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఆస్పత్రులకు వస్తున్న వారిలో చిన్న పిల్లల కేసులే ఎక్కువగా ఉన్నాయి. జ్వరం, జలుబు, దగ్గుతో చిన్నపిల్లలు బాధపడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందవద్దని డాక్టర్లు చెబుతున్నారు. వర్షాలు పడుతున్నందన వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందడం సర్వసాధారమని అంటున్నారు. కొత్త వైరస్‌లు ఏవీ పుట్టుకొచ్చే అవకాశాలు లేవని చెప్పుకొస్తున్నారు.

అయితే యాంటీ వైరల్, ఫ్లే, ఇన్ ఫెక్షన్ వైరస్‌లకు మెడిసెన్స్ అందుబాటులోకి ఉన్నాయని.. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని పిల్లల డాక్టర్లు అంటున్నారు. అయితే పిల్లల్లో జ్వరం, వాంతులు, విరేచనాలు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎవరికైనా రెండు మూడు రోజులకంటే ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Advertisement

Next Story