Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో నకిలీ ఐఏఎస్

by M.Rajitha |   ( Updated:2025-02-12 16:36:02.0  )
Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో నకిలీ ఐఏఎస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయానికి(Telangana Secretariat) నకిలీ ఉద్యోగుల(Fake Employees) బెడద పట్టుకుంది. సెక్రటేరియట్ లో ఇటీవల వరుసగా నకిలీ ఉద్యోగులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇదివరకే నకిలీ రెవెన్యూ ఉద్యోగి, నకిలీ ఎమ్మార్వో పట్టుబడగా.. తాజాగా నకిలీ ఐఏఎస్(Fake IAS) పట్టుబడటం కలకలం రేకెత్తిస్తోంది. బాలకృష్ణ ఐఏఎస్ పేరుతో నకిలీ ఐడీ కార్డు ద్వారా సచివాలయాలోకి తరుచూ రాకపోకలు చేస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. అతను నకిలీ ఉద్యోగి అని బయటపడింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ సీఎస్వో దేవీదాస్(Secretariate CSO Devidas) ఆదేశాలతో ఎస్పీఎఫ్ పోలీసుల అలెర్ట్ అయి, మరిన్ని తనిఖీలు చేపట్టగా.. మరో ఇద్దరు అటెండర్లు నకిలీలుగా గుర్తించారు. అయితే ఈ నకిలీల వ్యవహారంలో సచివాలయ ఉద్యోగుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన నకిలీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

నెల రోజుల వ్యవధిలో సెక్రటేరియట్ ప్రాంగణంలో ఒకరు రెవెన్యూ ఉద్యోగిగా హల్ చల్ చేయగా మరోకరు ఎమ్మార్వోగా చలామణీ అయ్యారు. కొంపెల్లి అంజయ్య అనే వ్యక్తీ ఎమ్మార్వో స్టీక్కర్ ఉన్న వాహనంతో సెక్రటెరియట్ కు పలుమార్లు వచ్చినట్లు ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. అతనిని గుర్తించి వారం క్రితం అరెస్ట్ చేశారు. గత నెలలో 28 వ తేదిన రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు తో చలామణి అవుతున్న ఖమ్మ కు చెందిన భాస్కర్ రావును గుర్తించారు. అతనికి సహకరించిన డైవర్ రవి అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ సింబ్బది భాస్కర్ రావును పట్టుకున్నారు. సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని,ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. తాజాగా బుధవారం కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో సెక్రటెరియట్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story