ఎన్నికలు విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్

by Disha Web Desk 23 |
ఎన్నికలు విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ విజయవంతం చేసిన స్ఫూర్తితోనే పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని హైదరాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏ ఆర్ ఓ లలు, రిసెప్షన్ టీమ్, వీఐఎస్, ఏఎమ్ఎఫ్, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాల బలోపేతం తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలు భాగంగా ఇప్పటి వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ, ఈవీఎంల సెగ్రిగేషన్, వీవీ ప్యాట్లలో లోడింగ్, కమిషనింగ్ కార్యక్రమాలను బాగా చేశారని అదే స్ఫూర్తితో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని అన్నారు.

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి సెగ్మెంట్ లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రోజ్ పోలింగ్ డే రోజు ఏం ఏం చేయాలననే దానిపై కౌంటర్ వైస్ స్టాఫ్ కు శిక్షణ ఇవ్వాలని ఏఆర్ఓలకు సూచించారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ సిప్ లను 100 శాతం పంపిణీ జరిగేలా చూడాలని, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతి సౌకర్యాలు త్రాగునీరు, కరెంట్, టాయిలెట్స్, కూలర్స్ ఉన్నాయా లేదా అని సెప్టోరల్ అధికారులు, ఏ ఆర్ ఓ లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించాలన్నారు. ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి బృందాలను బలోపేతం చేయాలన్నారు. నగదు, మద్యం అక్రమంగా రవాణా కాకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో భోజనాలు అందేలా ఫుడ్ యాక్షన్ ప్లాన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ వెంకటాచారి, ఈ ఆర్ ఓ ఎలక్షన్ తహసీల్దార్ జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story